అవక్షేపము
ఫిబ్రవరి 06, 2025
అవక్షేపము (ava-kshēpamu)
అర్థము
(విశేష్యము) : తప్పుపట్టి త్రోయుట; నిందించుట; రెండు పదార్థముల మధ్య జరుగు రాసాయనికమైన మార్పు ఫలితముగా ఏర్పడిన కరగనట్టి వేరొక పదార్థము
Meaning
(noun) : blaming; censure; discard after finding fault; residue; precipitate
వాడుక / Usage
అవక్షేపం వల్ల ఏర్పడిన శిలలను అవక్షేప శిలలు అంటారు.
Sedimentary rocks are formed due to accumulation of residue or sediments.
Sedimentary rocks are formed due to accumulation of residue or sediments.
మెదడుకు మేత / Food for thought
గుడ్డి చీకటిలోన గూబలుఘూంకరించాయి
వానవెలిసీ మబ్బులో ఒక
మెరుపుమెరిసింది
వేగుజామును తెలియజేస్తూ
కోడికూసింది
విడినమబ్బుల మధ్యనుండీ
వేగుచుక్కా వెక్కిరించింది
బాటసారి కళేబరంతో
శీతవాయువు ఆడుకుంటోంది
పల్లెటూల్లో తల్లికేదో
పాడుకలలో పేగుకదిలింది
-- బాటసారి, శ్రీశ్రీ (ఏప్రిల్ 30, 1910 - 1983)
Comments
Post a Comment