ఎడపదడప

 

ఫిబ్రవరి 11, 2025

ఎడపదడప (yedapa-dadapa)

   అర్థము

  (విశేషణము) : అడపాతడప; అప్పుడప్పుడు; ఎడము/వ్యవధి తో

  Meaning

  (adv) : occasionally; now and then

   వాడుక / Usage

    అనకాపల్లి జిల్లాలో అక్రమ తవ్వకాలు ఎడపదడప సాగుతూనే ఉన్నాయి.
    Illegal quarrying continues in Anakapalli district from time to time.

  మెదడుకు మేత / Food for thought

    మా ఊరు పేరు రౌతులపూడి. అసలు ఏ గ్రామానికైనా పుాడి అనే పేరు వచ్చిందంటే, ఒకప్పుడు ఆ పరిసరాలలో బౌధ్ధమతం ఉజ్వలంగా వర్థిల్లిందని అర్థమట. దానికి నిదర్శనంగానే, మా చుట్టుప్రక్కలగ్రామాలలో అనేక తవ్వకాలలో బైధ్ధమత చిహ్నాలెన్నో నేడు లభిస్తున్నాయి. ముఖ్యంగా రౌతులపూడికి అతిసమీపంలోగల ములగపూడిలో ఎన్నో బౌధ్ధమతచిహ్నాలు నేటికీ తవ్వకాలలో దొరుకుతూనే వున్నాయి. అలాగే ఎప్పటి నిర్మాణమో తెలాయని, అతిపురాతన రామాలంయంవుంది ములగపూడిలో. అది అచ్చు భధ్రాచలంలోని సీతారామస్వామివారి దేవాలయం లాగానే వుంటుంది. సీతమ్మవారు కూడా రాములవారి ఒడిలోనే కూర్చొని వుంటారు. గొప్ప పూజలూ ,ఉత్సవాలూ అక్కడ జరుగుతూవుంటాయి. మాఊరిలో ఉమాదేవి, రామలింగేశ్వర్ల ఆలయం మా ఊరికి పది పదిహేను కిలోమీటర్ల (అడ్డదారిలోవెళితే ఐదుకిలోమీటర్లు) సమీపంలో వున్న అన్నవరం వీరవేంకట సత్యనారాయణమూర్తి ఆలయంకంటే కూడా అతిపురాతనమైనది. ఈ ఆలయానికి రామలింగేశ్వరుడు చిట్టాప్రగడ వారి అబ్బాయిగాను, అమ్మవారు ఉమాదేవి గోటేటి వారమ్మాయిగాను పూజలందుకొంటారు.

    -- రౌతులపూడి, సత్యవాణి కుంటముక్కుల

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి