రూపవిక్రియ
ఫిబ్రవరి 07, 2025
రూపవిక్రియ (roopa-vikriya)
అర్థము
(విశేష్యము) : పరిపూర్ణమైన మార్పు; జంతువు యొక్క శరీర నిర్మాణంలో స్పష్టమైన మరియు సాపేక్షంగా ఆకస్మిక మార్పు
Meaning
(noun) : metamorphosis
వాడుక / Usage
సేల్స్‌మ్యాన్ గ్రెగర్ సంసా ఒక రోజు ఉదయం నిద్రలేచేప్పటికీ భారీ కీటకంగా రూపవిక్రియ చెందడం మెటామార్ఫోసిస్ యొక్క కథాంశం.
Metamorphosis tells the story of salesman Gregor Samsa, who wakes one morning to find himself inexplicably metamorphosed into a huge insect.
మెదడుకు మేత / Food for thought
ఆవేశం రావాలి … ఆవేదన కావాలిగుండెలోని గాయాలు మండించే గేయాలు
గుండెలోని గాయాలు మండించే గేయాలు
వేదనలై శోధనలై రగలాలి విప్లవాలు …. రగలాలి విప్లవాలు
ఆవేశం రావాలి … ఆవేదన కావాలి
నరజాతిని భవితవ్యానికి నడిపేదే ఆవేశం
పదిమందికి భవితవ్యాన్ని పంచేదే ఆవేదన
వేగంతో వేడిమితో సాగేదే జీవితం … సాగేదే జీవితం
ఆవేశం రావాలి … ఆవేదన కావాలి
రణదాహం ధనమోహం కాలి కూలిపోవాలి
సమవాదం నవనాదం ప్రతి ఇంటా పలకాలి
ప్రతి మనిషీ క్రాంతి కొరకు రుద్రమూర్తి కావాలి … రుద్రమూర్తి కావాలి
ఆవేశం రావాలి … ఆవేదన కావాలి
తరతరాల దోపిడీల ఉరితాళ్ళను తెగతెంచి
నరనరాల అగ్నిధార ఉప్పెనలా ఉరికించి
మరో కొత్త ప్రపంచాన్ని మనిషి గెలుచుకోవాలీ …
నిదురించిన నా కవితను కదలించిన ఆవేశం
మరుగు పడిన నా మమతకు తెర విప్పిన ఆవేదన
కన్నుగప్పి వెళ్ళింది నన్ను మరచిపోయింది … నన్ను మరచిపోయింది ..
-- మనసు మాంగల్యం, దాశరథి (జులై 22, 1925 - 1987)
Comments
Post a Comment