తర్జనభర్జన
ఫిబ్రవరి 10, 2025
తర్జనభర్జన (tarjana-bharjana)
అర్థము
(విశేష్యము) : వాదప్రతివాదములు; తీవ్ర చర్చ; తర్జని(చూపుడు వేలు, నిందించు), భర్జన(కాల్చు, కొట్టు)
Meaning
(noun) : serious discussion or dialogue
వాడుక / Usage
మేయర్ మార్పుపై కూటమిలో తర్జనభర్జన.
Serious debate in the coalition about Mayoral candidate.
మెదడుకు మేత / Food for thought
పిఠాపురాన్ని పూర్వం పీఠికాపురం అనేవారు. ఈ ఊరుకి అధిపతి పీఠాంబ. ఈ పీఠాంబ విగ్రహం ఒకటి ఒక చేతిలో బంగారు పాత్ర, వేరొక చేత బాగుగా పండిన ఉసిరి కాయ, మూడవ చేత త్రిశూలం, నాల్గవ చేత లోహ దండం
ధరించి నేటి పిఠాపురానికి సమీపంలో, నాలుగు వీధులు కలిసే కూడలిలో ఉండేదిట. ఈ విషయాన్ని శ్రీనాధుడు
భీమేశ్వర పురాణంలో చెబుతాడు. ఇటువంటి విగ్రహమే ఒకటి ఈనాడు కొత్తపేటలో కుమారస్వామి ఆలయంలో
ఉందిట. పిఠాపురానికి ఉత్తర దిక్కున ఏలేరు అనే ఏరు ఒకటి ఉంది. ఈ ఏలేరుని “జగతి నెక్కడి వేలేటి సాటి నదులు” అంటాడు శ్రీనాధుడు. అలా అనేసి ఊరుకోకుండా, “ఏలేటి విరినీట నిరుగారునుంబండు
ప్రాసంగు వరిచేలు పసిడిచాయ” అని చెబుతూ పిఠాపురం ప్రాంతం సస్యశ్యామలంగా ఉండేదని అప్పటి ఫల
వృక్షాలనీ, పిండివంటలనీ శ్రీనాధుడు వర్ణించేడు. ఒక్క వేరు పనస చెట్లు, పోక తోటలు ఇప్పుడు కనిపించడం
లేదేమో కానీ, మిగిలినవన్నీ ఇప్పటికీ ఉన్నాయి. పిఠాపురం వరకు వచ్చిన శ్రీనాధుడు కళింగ దేశం వరకూ
పర్యటించినట్లు ఆధారాలున్నాయి.
-- పిఠాపురం, వేమూరి వెంకటేశ్వర రావు (eemata.com)
Comments
Post a Comment