ఎల

 

మార్చి 10, 2025

ఎల (ela)

   అర్థము

  (విశేష్యము/విశేషణము) : లేత; యవ్వనం కలది; కోమలం; స్వల్పం; సాక్షి

  Meaning

  (noun/adj) : tender; delicate; young; slight; witness

   వాడుక / Usage

     ఎలదేటి పాట చెలరేగే నాలో చెలరేగిపోవే మధుమాసమల్లె.
     The song of a young bee buzzes in me, you bloom like the season of nectar.

  మెదడుకు మేత / Food for thought

     చిక్కఁడు సిరికౌగిలిలోఁ
    జిక్కఁడు సనకాదియోగిచిత్తాబ్జములం
    జిక్కఁడు శ్రుతిలతికావళిఁ
    జిక్కె నతఁడు లీలఁ దల్లి చేతన్ ఱోలన్.
   (ఆ లీలా గోపాలకృష్ణుడు సామాన్యమైనవాడా కాదు. లక్ష్మీదేవి కౌగిటలోను చిక్కలేదు, సనకసనందాది మహార్షుల చిత్తాలకు చిక్కలేదు. ఉపనిషత్తులకు చిక్కలేదు. ఆహా! అంతటి వాడు లీలగా అవలీలగా తల్లి చేతికి చిక్కి రోటికి కట్టివేయబడ్డాడు. భక్తపరాధీనుడు గనుక తల్లి యనే మిషచే తనకు అంతరంగ భక్తురాలు గనుక యశోదచేతికి చిక్కాడు.)

    -- మహాభాగవతం, బమ్మెర పోతన (1450 - 1510)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి