అలవోక

 

మార్చి 03, 2025

అలవోక (ala-vōka)

   అర్థము

  (విశేష్యము) : అల్ల (శాంతం/మందం)+పోక (ప్రవర్తన); లీల; విలాసం; తేలిక 

  Meaning

  (noun) : easiness; playful; without breaking a sweat

   వాడుక / Usage

     సెమీస్ కు దక్షిణ ఆఫ్రికా...ఇంగ్లాండు పై అలవోకగా విజయం.
     South Africa in semis with easy win over England.

  మెదడుకు మేత / Food for thought

    ఎవరికీ తలవంచకు...  ఎవరినీ యాచించకు
    గుండె బలమే నీ ఆయుధం... నిండుమనసే నీ ధనం
    కండలు పిండే కష్టజీవులకు తిండికి కరువుంటుందా?
    నిజాయితీకై నిలిచేవారికి పరాజయం ఉంటుందా? 
    మంచితనమ్మును మించిన పెన్నిధి... మనిషికి వేరే ఉందా
    చాలీచాలని జీతంతో మిడిమేలపు కొలువులు కొలవకు
    ముడుచుకుపోయిన ఆశలతో... హోయ్..  మిడిమిడి బ్రతుకును గడపకు
    చీకటి రాజ్యం ఎంతోకాలం చెలాయించదని మరవకు... చెలాయించదని మరవకు
    జీవితమే ఒక వైకుంఠపాళి... నిజం తెలుసుకో భాయీ
    ఎగరేసే నిచ్చెనలే కాదు... పడదోసే పాములు ఉంటాయి
    చిరునవ్వులతో విషవలయాలను... ఛేదించి ముందుకు పదవోయి...

    -- నిండు సంసారం (1968), డా. సి. నారాయణ రెడ్డి (జులై 29, 1931 - 2017)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి