ఇల్వడి
మార్చి 14, 2025
ఇల్వడి (ilvaḍi)
అర్థము
(విశేష్యము) : ఇలువడి; మంచి నడవడి; ఇలు=ఇల్లు; వడి=నడక; ఇంటి మర్యాద
Meaning
(noun) : decency; familial/lineage respect/tradition/character
వాడుక / Usage
తల్లితండ్రులు మంచి ఇల్వడి నేర్పనప్పుడు బడిలో గురువులను అని ప్రయోజనమేమి?
Why blame teachers when parents don't teach decency and respect?
మెదడుకు మేత / Food for thought
ఠాగూర్ ఒకసారి ఇలా అన్నాడు - కళ అందంగా ఉండాలి, కానీ, దానికి ముందు, అది నిజాయితీగా ఉండాలి.
కానీ నిజం అంటే ఏమిటి? శాశ్వత సత్యం లేదు. ప్రతి కళాకారుడు బాధాకరమైన తన సొంత ప్రక్రియ ద్వారా తనదైన సత్యాన్ని నేర్చుకోవాలి. మరియు అదే తన కళ ద్వారా అందరికీ తెలియజేయాలి.
-- రిత్విక్ ఘటక్ (నవంబర్ 4, 1925 - 1976)
Comments
Post a Comment