ఉసురు

 

మార్చి 19, 2025

ఉసురు (usuru)

   అర్థము

  (విశేష్యము) : ఊపిరి; ప్రాణం; బాధలో విడిచే ఊపిరి; ఒకరిని కష్టపెట్టినందుకు కలిగే పాపం

  Meaning

  (noun) : breath; life; sigh; evil result due to bad deed

   వాడుక / Usage

    ఊహ నీవే.. ఆహాహాహా.. ఉసురు కారాదా.. ఆహా మోహమల్లె.. ఆహాహాహా ముసురుకోరాదా.. ఆహా.
    You fill my imagination, become my life breath; encompass me like desire.

  మెదడుకు మేత / Food for thought

    మీ ప్రకృతి వర్ణనలపై ఏ సాహిత్య ప్రభావం ఎక్కువ ఉంది? ఆంధ్రమా, ఆంగ్లమా, ఆర్షమా?

ఒకరకంగా చెప్పాలంటే ఆంగ్లమే. కీట్స్, షెల్లీ, వర్డ్స్ వర్త్ వంటి వారు చేసిన ప్రయోగాలు కొన్ని నేనూ చేసాను. ఆ ప్రయోగాల్లో ఒక అస్పష్టమైన “రాలుపూల తేనియకై రాతిపూల తుమ్మెదనై” అని ఒక పాటలో రాసాను. ఏమిటిది అంటే అది నాకు అర్థం కావలసిందే, మీకర్థమైనవే రాస్తే ఇతరులకి ప్రయోజనం ఏమిటని? అంటే అక్కడ భావుకత, ఆ కేరెక్టర్‌ని నిలబెట్టే మాటలు అవే – “రాలిపోయిన పువ్వుల్లో తేనెని వెతికే రాతితుమ్మెదా ఉంటుంది. ఈ తుమ్మెద ఇక్కడనుంచి కదలలేదు. ఆ రాలినపూలలోంచి తేనిపొంగి పైకిరాదు” అనే భావం కోసం రాసాను. దీనికి మరో పేరు సర్రియలిజం, అధివాస్తవికత. అది నాకు చాలా ఇష్టం. ఈ అధివాస్తవికత ఉన్నదే కవిత్వం అనిపించుకుంటుంది.

-- వేటూరి సుందర రామమూర్తి (జనవరి 29, 1936 - 2010)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి