సోకు
మార్చి 20, 2025
సోకు (sōku)
అర్థము
(విశేష్యము/క్రియ) : తాకు; స్పర్శ; తగులు; దెయ్యం; రాక్షసుడు; షోకు (వగలు)
Meaning
(noun/verb) : touch; contact; evil spirit; fashion
వాడుక / Usage
తాకితే తాపం ఓహో కమలం ఓహో భ్రమరం ఓహో హో సోకితే మైకం ఓహో అధరం ఓహో మధురం.
Touching you, O lotus, raises temperatures (of the bee), brushing you mesmerises, lips so sweet.
మెదడుకు మేత / Food for thought
‘సాగరసంగమం’ చిత్రంలో ఓ పాటలో ‘పార్వతీ పరమేశ్వరౌ’ అనే పదబంధంలో ‘పార్వతిప… రమేశ్వరౌ’ అని విడదీశారు దీనికి కారణం ఏదైనా ఉందా?
‘పార్వతీచ’ పార్వతిని పాలించినవాడు ఎవరు? ఈశ్వరుడు. రమకు ఈశ్వరుడు ఎవరు? రమ అంటే లక్ష్మీదేవి ఆమెకు ఈశ్వరుడు మహావిష్ణువు జగత్తుకి తండ్రులైనటువంటి శివుడు విష్ణువులకు భేదం లేదని చెప్పడం కోసం, ఆ మహా సందేశం ఇవ్వడానికి ఆయన అలా రాశాడు. బహుజన హితాయ, బహుజన సుఖాయ, విశ్వశ్రేయః కావ్యం అన్నవి ప్రతిపాదించిన మహాకవి కాళిదాసు శైవమని, వైష్ణవమనీ ప్రజలు కొట్టుకు చస్తున్న రోజుల్లో తానే శైవుడై విష్ణు చరిత్ర రాస్తూ మొదటి శ్లోకం నిష్ప్రయోజనంగా రాస్తాడా ఆ మహాకవి? రాయడు కదా? ‘వాగర్ధములవలె కలిసి ఉండేవారు, విడివిడిగా ఉండే శివవిష్ణువులు ఇద్దరికి నమస్కరిస్తున్నాను’ అని మా పెదతండ్రి వేటూరి ప్రభాకరశాస్త్రి మా చిన్న తనంలో చెప్పినదాన్ని అవకాశం వచ్చినచోట నలుగురికి తెలియజెప్పడం కోసం ఆ విధంగా రాశాను.
-- వేటూరి సుందర రామమూర్తి (జనవరి 29, 1936 - 2010)
Comments
Post a Comment