శషభిషలు
మార్చి 04, 2025
శషభిషలు (SaShabhiShalu)
అర్థము
(విశేష్యము) : దొంగ నటనలు; ప్రయోజనం లేని తిరకాసులతో చర్చలు
Meaning
(noun) : masquerade; purposeless discussions
వాడుక / Usage
ఫిర్యాదుదారుడు మరణించిన కారణంగా శషభిషలు అవసరం లేదన్న జిల్లా కోర్టు.
Complainant dead, no need for purposeless arguments - District court.
మెదడుకు మేత / Food for thought
గెలుపు ఓటములను ఒకేలాగా తీసుకునే స్థితప్రజ్ఞత ఇంకా రాలేదు. కనీసం ఓటమికి క్రుంగిపోకుండా ఉండే స్థైర్యం
రావటానికి కూడా సమయం పడుతుందేమో. కాని ఈ ఆటలో పాములు, నిచ్చెనలు యెంత సహజమో జీవితంలో
రావటానికి కూడా సమయం పడుతుందేమో. కాని ఈ ఆటలో పాములు, నిచ్చెనలు యెంత సహజమో జీవితంలో
కూడా అపజయాలు, విజయాలు అంతే సహజమని మాత్రం తెలిసింది.... పాము నోట్లో పడి కిందకి
పడిపోయినపుడల్లా అక్కడే ఆగిపోకుండా నిచ్చెన కోసం ఎదురుచూస్తూ అడుగులు వెయ్యటం నేర్పింది ఈ జీవితం... అందుకే ఒక సినీ కవి అన్నట్టు అనుకున్నామని జరగవు అన్నీ... అనుకోలేదని ఆగవు కొన్ని... జరిగేవన్నీ మంచికే...
అవును నిజమే గెలుపు ఓటములు అనేవి మానసికానుభూతులు... మార్గం ఏదైనా అంతిమంగా ఎప్పటికైనా
చేరుకోవాల్సింది మాత్రం పరమపదమే అనేదే సారాంశం.....కొన్ని వేల పద్యాలు, పాటలు, మాటలు అందించగలిగే
వికాసం ఈ ఒక్క తెలుగు ఆట అందించేస్తుంది.... జీవన సారాన్ని స్తైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, నైతిక విలువల్నీ
రంగరించి అందించే అపూర్వ వ్యక్తిత్వవికాస గ్రంధం మన ఈ వైకుంఠపాళి...
-- ఏరువాక, https://lgkale.blogspot.com/2012/10/blog-post_21.html
Comments
Post a Comment