దోసిలి

 

మార్చి 21, 2025

దోసిలి (dōsili)

   అర్థము

  (విశేష్యము) : రెండు చేతులు వంచి దగ్గరగా పెట్టడం; అంజలి; నమస్కారం

  Meaning

  (noun) : hands held together to form a cup; salutation

   వాడుక / Usage

    పున్నాగ కోవెల్లోన పూజారి దోసిళ్ళన్ని యవ్వనాలకు కానుక.
    Temple pure as lotus are you, your worshippers hands held together a gift to your graces.

  మెదడుకు మేత / Food for thought

    మీ దృష్టిలో సినిమా పాటకి భాష ముఖ్యమా లేక భావం ముఖ్యమా?

మౌనభాష భావం, వ్యక్తభావమే భాష. ఈ రెండూ “వాగర్ధావివసంపృక్తౌ” అన్నట్లు, అర్థం-మౌనం, వాక్కు – శబ్దం. అర్థానికి శబ్దం కావాలి, శబ్దానికి అర్థం కావాలి. భాష ముఖ్యమా భావం ముఖ్యమా అంటే భాషాభావం వేరుకాదు. భావంలేని భాష లేదు అని చెప్పాలి.

-- వేటూరి సుందర రామమూర్తి (జనవరి 29, 1936 - 2010)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి