ఎద్దేవా
మార్చి 05, 2025
ఎద్దేవా (eddeva)
అర్థము
(విశేష్యము) : యద్దేవా; హేళన; గేలి; వెక్కిరింపు; "యద్దేవా దేవహేళనమితి" (ఓ దేవా! నేను దేవ హేళన చేసి ఉంటే) అని వేదంలో శతపథ బ్రాహ్మణంలోని మంత్రం నుంచి. వాడుకలో మొదటి పదానికి హేళన అనే అర్థం వచ్చింది.
Meaning
(noun) : ridicule; mockery; derision
వాడుక / Usage
నమస్కారం పెట్టాలని చూస్తున్నా, కానీ ఆయన అసెంబ్లీ కి రావట్లేదు - కోటంరెడ్డి ఎద్దేవా.
Looking to wish him in the assembly, but he is not seen - Kotamreddy ridicules.
మెదడుకు మేత / Food for thought
మదన కామరాజు పుస్తకాలపై మోజుతో, తనకు చదువురాకపోయినా ఎవరి చేతైనా చదివించుకుందామని వాటిని గుట్టుగా దాచుకున్న ఒక ముసలావిడ ఉజ్జాయింపుగా ఓ వందేళ్ల క్రితం తెలుగు సాహిత్యానికి అనుకోకుండా ఓ మేలు చేసింది. చదువొచ్చిన ఒక కుర్రాడి చేత ఆ పుస్తకాలను చదివించుకుంది. కులవిద్య అయిన పంచాగంతో పాటు, సంస్కృతమూ చదువుకుంటూ పండితుల దోవలో పోవాల్సిన ఆ కుర్రాడికి తెలుగు మీద మోజు పెరగటానికి ఆమె కూడా అలా కారణమయ్యింది. ఆ కుర్రాడు శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి. పాండిత్యం వద్దనుకున్నాడు, అవధానాలు వద్దనుకున్నాడు. కథలు చెప్పాలనుకున్నాడు. అలా ఇలా కాదు: “భాష పరసీమలు చూడాలి. గజం యెత్తు పుస్తకాలు రచించాలి”. ఇదీ లక్ష్యం. తెలుగు సాహిత్యంలో శ్రీపాద ఒక అపూర్వమైన సంభవం. ఆయన పండితుల దారిలో పోకుండా కథలు చెప్పాలని పూనుకోవటం తెలుగు సాహిత్యానికి గ్రహస్థితి బాగున్న కాలం. ఆయనకు ఇంగ్లీషు రాదు, పైపైచ్చు హిందీ అంటే పిచ్చి కోపం. దాంతో ఆ మేధస్సు ఈ నేలలో వేళ్లూనుకుని ఇక్కడి సారంతో చేవదేరింది. చుట్టూ ఉన్న బ్రాహ్మణ కుటుంబాల్లోని మనుషులపై ఎంతో ఇష్టంతో వాళ్ళ మాటల్లోనూ చేతల్లోనూ కవిత్వాన్ని చూసి ఉప్పొంగిపోయి, వాటిని కథల్లో పెట్టాలని ఉబలాటపడ్డాడాయన. ఆయన ఆత్మకథ “అనుభవాలూ జ్ఞాపకాలూను” లో కథలు రాయాలనే జ్వరం ఆయన్ని ఎలా పట్టుకుందో చదువుతుంటే ఒళ్ళు జలదరిస్తుంది. ఇంత ప్రపంచంలో, ఇన్నిన్ని బృహత్ కార్యాలు దొర్లే లోకంలో కథలు చెప్పటం మీద ఆయన పెంచుకున్న మక్కువ చూస్తే, కథలు చెప్పేందుకు వీలుగా జీవితాన్ని దిద్దుకున్న మంకుపట్టును చూస్తే, ఇలా ఉండాల్రా రాసేవాడు అనిపిస్తుంది. ఆయన కథల్నీ, కథల కున్న శక్తినీ చిత్తశుద్ధితో నమ్మాడు. మార్పు తెస్తాయనీ, మంచి చేస్తాయనీ నమ్మకంతో రాశాడు. అందుకే కాలంలో కలిసిపోయినా, కథల్లో మిగిలాడు.
-- శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గురించి http://vaakili.com/patrika/?p=13538
Comments
Post a Comment