ధోరణి
ఏప్రిల్ 01, 2025
ధోరణి (dhōraṇi)
అర్థము
(విశేష్యము) : పద్ధతి; ప్రవర్తన; వరుస; పంక్తి
Meaning
(noun) : behaviour; style; tradition; line; series;
వాడుక / Usage
మూస ధోరణికి భిన్నంగా లేని స్టార్ హీరో సినిమాలు తెలుగు చిత్ర పరిశ్రమకు చేటు.
Stereo-typically styled star hero movies are a bane to Telugu film industry.
మెదడుకు మేత / Food for thought
నీకు ఉపయోగపడుతుందో లేదో తెలియదుగానీ నాకు ఈ 55 ఏళ్ళ వయసులో అర్థం అయ్యింది ఏమిటంటే - చిన్నదైనా పెద్దదైనా చెప్పటానికి నిజం ఒకటే ఉంటది. దాన్ని ఎన్ని కాపీలు తీసినా కాపీకి కాపీ తీసినా అసలు అసలే, నకలు నకలే. నకలు చూపించుకోడానికి ఉపయోగపడుతుందేమోగానీ చెల్లదయ్యా.
-- రాజ రాజ చోర (2021), హసిత్ గోలి
Comments
Post a Comment