కలయిక

 

మార్చి 18, 2025

కలయిక (kalayika)

   అర్థము

  (విశేష్యము) : సంగమము; కలిసికొనుట; రతి; మైథునం

  Meaning

  (noun) : meeting; union; copulation

   వాడుక / Usage

    ఇన్ని కలలికలెందుకో కన్నె కలయిక కోరుకో కలవరింతే కౌగిలింతై.
    Why all these dreams; choose union with beloved as the babbling becomes an embrace.

  మెదడుకు మేత / Food for thought

    మీరు చదివిన విద్యలో మీకు నచ్చినది ఆంధ్రసాహిత్యమా లేక ఆంగ్లసాహిత్యమా?

రెండూనండీ. రెండూ గొప్పవే. నేను చదివింది, విన్నది ఎంత? నా చదువు చాలా కొద్ది కానీ ఒక కీట్స్ వంటి మహాకవిని కన్న ఆంగ్లసాహితీ సరస్వతి ఎంత గొప్పదో. జాన్ కీట్స్ – ఆయన ప్రభావం నామీద చాలా ఉంది. ఆ రోజుల్లో మా గురువులు శ్రీ మల్లాది గారు ఒకసారి నాతో అన్నారు – “నాయనా, అందమె ఆనందం ఆనందమె జీవిత మకరందం” అనే పాట నాదే అనుకుంటున్నావేమో, కాదు కాదు ఆ భావన కీట్స్ ది అన్నారాయన.

-- వేటూరి సుందర రామమూర్తి (జనవరి 29, 1936 - 2010)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి