కలవరము

 

మార్చి 17, 2025

కలవరము (kalavaramu)

   అర్థము

  (విశేష్యము) : ఆందోళన; కలత; చింత; సంతాపం; చీకాకు

  Meaning

  (noun) : anxiety; confusion; perturbation; perplexed

   వాడుక / Usage

     వయ్యారి గోదారమ్మ ఒళ్ళంతా ఎందుకమ్మ కలవరం కడలి ఒడిలో కలిసిపోతే కల వరం.
     Enchanting Godavari, why are you anxious! Uniting with the ocean is dream come true.

  మెదడుకు మేత / Food for thought

    మంచి కవిత్వానికి మీరిచ్చే నిర్వచనం ఏమిటి?
 “‘విశ్వశ్రేయస్సు కావ్యం’ అన్నారు కాళిదాసు. నవల కానిండీ… కథ కానిండీ ఏదయినా కావ్యాలకిందే లెక్క. ఇవన్నీ విశ్వశ్రేయస్సును కోరాలి. అలాగే “వాక్యం రసాత్మకం కావ్యం’ అని కూడా అన్నారు. ” కావ్యంలో ఒక్క మంచిమాట ఉన్నా అది కవిత్వం అవుతుంది. కవిత్వ ప్రయోజనం ఏమిటంటే కాంతిని చూపించడమే. కవి అంటే సూర్యుడు. కవిత్వం అంటే సూర్యకాంతి. చీకట్లో వెలుగునిచ్చేది. శీతలంలో వెచ్చదనాన్ని ఇచ్చేది. సూర్యకిరణం వేడినీ వెలుగునీ ప్రసాదించడమే కవిత్వం యొక్క ప్రయోజనం. అదే మంచి కవిత్వానికి నిర్వచనం”.
-- వేటూరి సుందర రామమూర్తి (జనవరి 29, 1936 - 2010)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి