నెలవు
మార్చి 07, 2025
నెలవు (nelavu)
అర్థము
(విశేష్యము) : నివాస స్థానం; చోటు; స్థావరం
Meaning
(noun) : abode; place
వాడుక / Usage
ఖమ్మం జిల్లా కనకగిరి కొండలు ప్రకృతి అందాలకు నెలవు.
Kanakagiri hills in Khammam district are the abode of nature's beauty.
మెదడుకు మేత / Food for thought
అమ్మ చేతితో కలిపి పెట్టిన ఆవకాయ ముద్ద ముందు అమృతం కూడా దిగదుడుపే అని చెప్తే అది అతిశయోక్తి కాదేమో... పుట్టుక అంటూ లేని ఆ పరంధాముడు కూడా ఎన్నో సార్లు గర్భవాసం చేసి అమ్మ చేతి గోరుముద్దలు తిని పొంగిపోయాడు... “చిక్కడు సిరి కౌగిటిలో, చిక్కడు సనకాది మునుల చిత్తాబ్జములన్, చిక్కడు శ్రుతి లతికావళి, చిక్కెనతడు లీల తల్లి చేతన్ ఱోలన్” అని అంటారు పోతన గారు పరవశించిపోతూ... గొప్పగొప్ప జ్ఞానులకు దొరకని ఆ పరమాత్మ, ఆఖరికి లక్ష్మీ దేవికి కూడా చిక్కని ఆ పరంధాముడు, తల్లి చేతికి, తల్లి మమకారానికి దొరికిపోయి కట్టుబడ్డాడట... నిజమే, ఆ దైవాన్ని సైతం లాలించి ఆడిస్తుంది అమ్మ.
-- మాతృదేవోభవ, ఏరువాక (https://lgkale.blogspot.com/2015/05/blog-post_10.html)
Comments
Post a Comment