తేగ

 

మార్చి 25, 2025

తేగ (tēga)

   అర్థము

  (విశేష్యము) : తాటి మొలక

  Meaning

  (noun) : tender palmyra palm sprout 

   వాడుక / Usage

    పీచు పదార్థం ఎక్కువ ఉన్న తేగలు తింటే జీర్ణానికి మంచిది.
    Tender palmyra sprout is rich in fibre and good for digestion.

  మెదడుకు మేత / Food for thought

చేజారిన అవకాశాలు, కోల్పోయిన ఆ తీసుకోని మార్గాలు, తిరిగి రాని అనుభూతులు. బ్రతికి ఉండడంలో ఇవి ఒక భాగం. కానీ మన బుర్రలో - నా ఊహలో - ఒక చిన్న గదిలో ఈ గుర్తులు దాచుకుంటాం. గ్రంథాలయంలో పుస్తకాలు పేర్చినట్లు. మన హృదయ నాదం అర్థం కావాలంటే క్రొత్తగా ఎప్పటికప్పుడు వాటికి కొత్త సూచికలు తయారు చేసుకోవాలి. దుమ్ము దులుపుతూ ఉండాలి, తాజా గాలి లోనికి రానివ్వాలి, పూల కుండీలో నీరు మార్చాలి. ఇంకోలా చెప్పాలంటే నీదైన నీకోసమే అయిన ఆ మదిలోని గురుతుల గదిలోనే నీ మనుగడ ఎన్నటికీ.

-- కాఫ్కా ఆన్ ది షోర్, హరుకి మురకామి (జపానీ రచయత)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి