డగ్గుత్తిక
ఏప్రిల్ 02, 2025
డగ్గుత్తిక (ḍagguttika)
అర్థము
(విశేష్యము) : డక్కు=భయం, బాధ; కుత్తిక=గొంతు; గద్గద స్వరం; బొంగురు గొంతు
Meaning
(noun) : choked; broken voice
వాడుక / Usage
భరించరాని దుఃఖంతో, డగ్గుత్తికతో “ఇంక మనసైన్యంలో విజయాశ అడుగంటిపోయింది” అని చెప్పి వలవల ఏడ్చాడు సంజయుడు.
Overcome with grief Sanjaya choked saying "our army lost any hope of victory".
మెదడుకు మేత / Food for thought
అమ్మ మనల్ని తొమ్మిది మాసాలు మోసింది కాబట్టి మనం పుట్టాం అనుకుంటారు కొందరు. లేదు నాన్నతో పది నిముషాలు సుఖపడితే పుట్టాం అనుకుంటారు కొందరు. రెండూ నిజాలే. కానీ మొదటిది నమ్మినవాడు మనిషవుతాడు. రెండోది నమ్మినవాడు పశువవుతాడు.
-- కృష్ణం వందే జగద్గురుమ్ (2012), జాగర్లమూడి రాధాకృష్ణ
Comments
Post a Comment