నిఖార్సయిన

 

ఏప్రిల్ 14, 2025

నిఖార్సయిన (nikharsaina)

   అర్థము

  (విశేషణము) : నిజాయితీ; నిఖార్(ఉర్దూ)=నిర్మలం, శుభ్రం

  Meaning

  (adv) : sincere; straightforward; 

    వాడుక / Usage

    అయన నిఖార్సయిన 'ప్రభుత్వ ఉపాధ్యాయుడు'.
    He is a very sincere government teacher.

  మెదడుకు మేత / Food for thought

    ఓ ఓడమాలి, తీరం కానదేమోయి

    సెలయేరు కలిసింది కృష్ణమ్మలో, కృష్ణమ్మ కలిసింది ఆ కడలిలో

    కడలి కడకి కలిసేది ఏ నీటిలో ఏ నీటిలో, తెలియలేదే ఎవ్వరికీ


    సూరీడు కోసం భూమమ్మ ఎదురు సూస్తాది

    నేల తల్లికోసం సెందురూడు కాపు కాస్తాడు

    సెందురూడు కాపు కాస్తాడు

    నీటనున్న నత్తగుల్ల వలే ఆ…. నీటనున్న నత్త వలే

    ప్రతి హుదయానికి దప్పికే ఆ… దప్పికే


    ఓ నేస్తమా ఓ…

    నీటనున్న నత్తగుల్ల వలే ప్రతి హుదయానికి దప్పికే

    సుక్క యే మబ్బున దాగుందో ఎవడికి ఎరుకా, ఎవడికి యెరుక


    తెలియని పెదాల పైన తెలిసిన పాటలెందుకో

    తెలిసిన పాటలెందుకో

    నిన్నటిదాకా తెలియనివారు, జనమ జనమాల జోడు నేడు

    జనమ జనమాల జోడు నేడు


    ఓ నేస్తమా ఓ…

    నిన్నటిదాకా తెలియనివారు, జనమ జనమాల జోడు నేడు

    యే నిమిసాన యేమి జరుగుతాదో యెవరికి తెలుసు యెవరికి తెలుసు


    -- అనోఖీ రాత్ చిత్రంలో ఇందీవర్ రచించిన గీతం ओह रे, ताल मिले नदी के जल में కి స్వేచ్ఛానువాదం

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి