ముక్తసరి

 

ఏప్రిల్ 15, 2025

ముక్తసరి (mukthasari)

   అర్థము

  (విశేషణము) : సంగ్రహంగా, క్లుప్తంగా, టూకీగా

  Meaning

  (adv) : brief; succinct; concise; summary

    వాడుక / Usage

    "సినిమా ప‌రంగా నా వ‌య‌సు ప‌ద‌హారేళ్లు ద‌ట్సాల్‌“ అని ముక్త‌స‌రి స‌మాధానం ఇచ్చారు.
    "I was 16 in the movie", she gave a brief response.

  మెదడుకు మేత / Food for thought

    "విషాన్ని విషంగా  గుర్తించడానికి ఇష్టపడని వాళ్ళకి అది విషం అని చెప్పడం వృధా." నార్వేకి చెందిన నాటకాల రచయిత హెన్రిక్ ఇబ్సెన్ 1882 లో రచించిన నాటిక "యాన్ ఎనిమి అఫ్ ది పీపుల్ " ని పంతొమ్మిది వందల అరవైల్లో గొల్లపూడి మారుతీ రావుగారు తెలుగు రంగస్థలం కోసం "సత్యంగారిల్లెక్కడ" గా అనువర్తించారు. సత్యజిత్ రాయ్ ఇబ్సెన్ నాటికని ఘనశత్రు పేరుతో 1990 లో సినిమాగా తీశారు. ఈ నాటిక ఈనాటికి ఏనాటికి అయినా అద్దం పడుతుంది. కుట్రలు కుతంత్రాలు తో మకిల పడిన సమాజం , దానిని తమ స్వప్రయోజనాల కోసం వంచించే రాజకీయ నాయకులు, అజ్ఞానంతో తోలు బొమ్మల లాగా వాళ్ళ చేతిలో ఆయుధాలు అయ్యే అమాయక ప్రజలు, వీళ్లందరి నడుమ సత్యం కోసం నిలబడిన డాక్టర్ సత్యం ఈ నాటిక కథాంశం. ఆఖరి సీన్ లో డా; సత్యం ఊరు వదిలి వెళ్లిపోతుంటే దాసు అడుగుతాడు సత్యంగారిల్లెక్కడ అంటే యేమని చెప్పమన్నారు అని? దానికి ఆయన సమాధానం - "మనిషి మనిషిగా బ్రతక గలిగిన చోట, మనిషిని మనిషే తినడం మరగని చోట సత్యానికి చల్లని నీడ ఉంటుంది. అక్కడ పచ్చటి గూడు కట్టుకుని బ్రతుకుతాం."ఆ మాటలతో తెర పడుతుంది. ఆ తెర నాటకానికి గాని సత్యానికి కాదని తలుస్తూ సత్యాన్వేషణ మన జీవితాశయం కావాలని ఆశిస్తున్నాను.


    -- https://manatelugumaata.blogspot.com/2020/05/blog-post.html

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి