అసలు
ఏప్రిల్ 17, 2025
అసలు (asalu)
అర్థము
(విశేష్యము) : బురద; మొదటిది; కల్తీ లేనిది; నిజమైనది; మూలధనం
Meaning
(noun/adj) : mud; original; legitimate; capital or principal
వాడుక / Usage
వడ్డీ మాట దేవుడెరుగు అసలు కూడా కట్టలేని స్థితిలో మధ్యతరగతీకులు.
Forget about interest, middle class is struggling to repay even the principal.
మెదడుకు మేత / Food for thought
తల కొంతగా వంచితే రాయి కూడా దేవతై పోతుంది
తన నంతగా ప్రేమించకు తను వంచకై పోతుంది
నేనూ నదినే నా గతి శృతి నాకు తెలుసు
ఏ వైపుకు వెళితే అదే తుళ్ళి తుళ్ళి దారై పోతుంది
ఎంతో నిజాయతీతో జీవితం నాతో అంది
నువ్వు నాకు కాకపోతే మరొకరితో నాకు ముడై పోతుంది
పై వాడి మీద భారం వేసి తాగుతున్నాను మిత్రమా
హాలాహలం ఉన్నా ఇందులో ఔషధమై పోతుంది
అన్నీ తనవే గాలి పరిమళం నేల నీలాకాశం
నేను ఎటు వెళ్లినా ఎక్కడికి వెళ్లినా తనకి తేట తెల్లమై పోతుంది
-- https://manatelugumaata.blogspot.com/2024/05/blog-post.html
Comments
Post a Comment