తాలూకా

 

ఏప్రిల్ 18, 2025

తాలూకా (tālūkā)

   అర్థము

  (విశేష్యము) : జిల్లాలో ఒక భాగం; సంబంధించిన

  Meaning

  (noun/adj) : sub division of a district; belonging to; related to

    వాడుక / Usage

    నిఖార్సైన అసలు సిసలు తెలుగు పదాలతోనే తాలూకా ఉండాలని ముక్తసరిగా చెప్పిన ఆ భాషా ఛాందసుడుని చూసి నవ్వు ఆగలేదు.
    It was amusing to hear the language fanatic quip that only immaculate words belonging to Telugu should be used.

  మెదడుకు మేత / Food for thought

    అనంత విశ్వంలో ఆణువణువూ జీవించే అవధి లేని కుటీరం నువ్వు 
    కానీ సుదీర్ఘ యానంలో
    జిలుగు వెలుగుల వేటలో వెతికాను నీ లేమి కోసం

    సర్వ జీవాజీవ కోటిని కదిలించే శక్తివి నువ్వు
    కానీ సుదీర్ఘ యానంలో
    భౌతిక ప్రపంచంలో అందుకోలేనంతగా నిగూఢమయ్యావు

    ఈ సుదీర్ఘ యానంలో,ఇదిగో ఇక్కడే ఉన్నాను అంటూ
    అంతరిక్షంలో, స్థబ్దతతో, నిశ్శబ్దం గా ఆధారాలు వదిలావు
    ఇప్పుడు సూర్యభ్రమణాలు హెచ్చే కొద్దీ యోగులు తదైక్యమైన నీ స్వరూపాన్ని నే పరితపిస్తున్నాను

    ప్రతి ఉదయం పక్షుల కలకలారావాలలో, ఆకుల రెపరెపలలో,
    సేద తీరే పవనాలలో నువ్వు తళుక్కుమంటావు
    నిరాఘాటమైన గంటల పాదవడిలో బాహ్య ప్రపంచపు గడబిడలో నీ మనుగడ మరచిపోతున్నాను

    కానీ మరి కొంత ఏకాగ్రతతో, ఆలోచనలతో మేఘావృతమైన
    మస్తిష్కంలో క్షణిక కాలం నీ ఉనికి అగుపడుతోంది
    ధ్యానాంతరం నిను స్పృశిస్తో ఉండుట కోసమే ఈ నా తపన , ఈ నా సుదీర్ఘ ప్రయాణం!

    -- https://manatelugumaata.blogspot.com/2019/06/blog-post.html

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి