అలకము

 

ఏప్రిల్ 21, 2025

అలకము (alakamu)

   అర్థము

  (విశేష్యము) : ముంగురులు; కేశములు; జుట్టు

  Meaning

  (noun) : curls

    వాడుక / Usage

    నిటల(ల+అ=లా)అలకము లంట నివుర జుంజుమ్మని ముఖసరోజము నిండ ముసురుఁ దేంట్లు.
    As she cleared the hair falling on her forehead, bees swarmed her lotus-like face.

  మెదడుకు మేత / Food for thought

    నాగరికత పెనవేసుకు పోయింది, లోబడి
    ఒక శాసనానికి, శాంతి అనే ఓ ఆకృతికి,
    వన్నె వన్నెగా భిన్న భిన్నంగా అల్లుకుపోయిన మాయకి; తలపుల వడి
    మనిషి జీవితం, భయంతో భీతిల్లినా మనిషి ఆపలేడు
    మారణహోమం, యేళ్లు శతాబ్దాలు అయినా శతాబ్దాలు యుగాలైనా
    శమించని ఆకలితో ప్రళయ తాండవం చేస్తో, సర్వ విధ్వంసం కావిస్తో వచ్చేది
    ఎడారి వంటి వినాశనమైన వాస్తవంలోకే:
    ఈజిప్టు మరియు గ్రీకు రాజ్యాలకు వీడ్కోలు, వీడ్కోలు రోమ్ మహాసామ్రాజ్యానికి.

    ఋషులు మేరు పర్వతం పైన, యోగులు హిమాలయాల్లో
    మంచు కప్పిన ఆ గుహల్లో, ఎముకలు కొరికే శీతాకాలపు హిమ పాతం
    తమ నగ్న శరీరాలను చాకుల్లా తాకుతున్నా, వారికీ తెలుసు
    పగటి వెంబడే చీకటి వస్తుందని, ఉషోదయానికి ముందే
    మనిషి యొక్క ప్రశస్తి మనిషి కట్టిన సౌధాలు తృటిలో బూడిదై పోతాయని.

    -- మేరు (1934), విలియం బట్లర్ యేట్స్ (1865 - 1939) ఐరిష్ కవి  

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి