బింబ
ఏప్రిల్ 22, 2025
బింబ (bimba)
అర్థము
(విశేష్యము) : దొండ పండు; ప్రతిమ; అద్దము
Meaning
(noun) : scarlet coloured fruit; mirror
వాడుక / Usage
నళులఁ జోపఁగఁ జిల్క లల్ల నల్లన చేరి- యోష్ఠబింబద్యుతు లొడియ నుఱుకు.
As she waved the bees away, parrots swooped in mistaking her lips for a ripe fruit.
మెదడుకు మేత / Food for thought
దూరమైనది కనుమరుగైనది నాకు దగ్గరే;
నీడ మరి రవి కిరణం ఒక్కటే;
అంతర్ధానమైన దేవుళ్ళు కనుల ముందు ప్రత్యక్షమవుతారు;
ఒక్కటే నాకు కీర్తి లేక అపకీర్తి.
నన్ను వదిలి వేదనతో తపిస్తారు;
నన్ను గగనానికి ఎగరవేస్తే, రెక్కలు నేనవుతాను;
సంశయించేవాడిని నేనే, సంశయాన్నీ నేనే;
బ్రహ్మవిదులు వల్లించే వేదాన్ని నేనే.
-- బ్రహ్మ , రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ (1803 - 1882) అమెరికన్ కవి
Comments
Post a Comment