పాఠీనము
ఏప్రిల్ 23, 2025
పాఠీనము (pāṭhīnamu)
అర్థము
(విశేష్యము) : వేయి కోరల చేప; ఒక రకమైన చేప;
Meaning
(noun) : a fish with numerous teeth; kind of catfish
వాడుక / Usage
శుకములఁ దోలఁ జక్షుర్మీనములకు మం- దాకినీ పాఠీనలోక మెసఁగు.
As she scared the parrots away, giant fishes from celestial Ganga zoomed in to her fish-like eyes.
మెదడుకు మేత / Food for thought
ఘడియలు చెప్పే గడియారంలో గంటలు గణించినపుడు,
గండ్రగొడ్డలి వంటి పగలు కళ్లు కప్పి మాయమయ్యె కరాళ రాత్రియై;
సువాసనలు విరిసే మల్లెతీగలు వడిలి హొయలు బాసినపుడు,
కాలనాగు వంటి నల్లటి కురులు మెరవగా ముగ్గువలె ధవళమై;
అప్పుడు స్ఫురించింది ఈ ప్రశ్న అహో నీ అందం
కాలం చేసే లయవిన్యాసంలో అంతం అవ్వక తప్పదు కదా,
ప్రేయసీ ప్రియులు తమను తాము త్యాగం చేసే అనుబంధం
వలపుల పంట అంతకు అంత అవ్వగా తాము సమసిపోతారు గదా;
కాలపు కొడవలి కోత నుంచి లేదు జగాన కాపాడే యే కవచం,
కొత్త తరం తక్క, నూకలు తీరిననాడు ఎగిరిపోవడం తథ్యం ఈ వచం

-- షేక్స్పియర్ (https://manatelugumaata.blogspot.com/2024/01/blog-post.html)
Comments
Post a Comment