మెలత
ఏప్రిల్ 25, 2025
మెలత (melata)
అర్థము
(విశేష్యము) : స్త్రీ
Meaning
(noun) : a woman
వాడుక / Usage
మెలత మొగిలు పిఱిఁది మెఱుఁగుఁదీవయుఁ బోలె జలదవర్ణు వెనుకఁ జనెడునపుడు.
Like a lightning bolt that follows a cloud, Lakshmi followed Vishnu the cloud hued one.
మెదడుకు మేత / Food for thought
మనసున పేరుకున్న పుట్టెడంత చింతలు
కరిగి కన్నీళ్ళై చేతిన వర్షించగా
అశృతుషారాలతో బిక్కు బిక్కు నున్న
ప్రతి రోమము రొమ్ము విప్పి నవ్వేనే
మనసా నందమా నంద మాయే
మానస సరోవరం కల్లోల మగ్నం
నవదర్పణం తొంగి చూడగా
పాశం నాశం లేనిదై అర్థనిమీలిత నేత్రాలతో
ప్రాణ హంస తరలి వచ్చెనే
మనసా నందమా నంద మాయే
నవదర్పణం తొంగి చూడగా
పాశం నాశం లేనిదై అర్థనిమీలిత నేత్రాలతో
ప్రాణ హంస తరలి వచ్చెనే
మనసా నందమా నంద మాయే
-- https://manatelugumaata.blogspot.com/2024/03/blog-post.html
Comments
Post a Comment