శ్లాఘనము
మే 01, 2025
శ్లాఘనము (ṣlāghanamu)
అర్థము
(విశేషణము) : ప్రశంస; స్తుతి; పొగడ్త; స్తోత్రము
Meaning
(adj/noun) : praise; applause; flattery
వాడుక / Usage
నటుడిగా, దర్శకునిగా, రచయితగా గిరీష్ కర్నాడ్ సేవలు శ్లాఘనీయమని ఆయన కొనియాడారు.
He praised Girish Karnad's laudable contributions as an actor, director and writer.
మెదడుకు మేత / Food for thought
ఏం దురభిమాన దుర్యోధనా! ఆ భీముని భీషణ వాక్కులు నీకు ప్రళయకాలపరివృథ గర్జనములై ఛిద్రములైనవి కదూ! ఆ యుధిష్టిరుని ఉపశమనబోధలు నీ వెడదహృదయమును తుత్తునియలుచేయు మరణాఘాతములైనవి కదూ! చతుస్సముద్రవేలావలయుత ధరణీపట్టభద్రుడవు, కౌరవసామ్రాజ్య సింహాసనాధీశ్వరుడవు, సుయోధన సార్వభౌముడవు! ఏమైనది నీ అఖండ సామ్రాజ్య వైభవము? ఎక్కడ నీ హంసతూలికాతల్పములు? వినిపించవే సుప్రభాతగీతికలు?..ఆక్రోశించునది ఆ కౌంతేయులుకాదు! అవమాన సంక్షుభిత హృదయుడవు నీవే! నీవే ఆ అభాగ్యుడవు. అసమర్ధుడవు!
-- దుర్యోధనుడు (ఎస్వీఆర్), చిత్రం - పాండవ వనవాసం, మాటలు - సముద్రాల సీనియర్
Comments
Post a Comment