ఇను
మే 19, 2025
ఇను (inu)
అర్థము
(విశేషణము) : రెండు; రెట్టింపు
Meaning
(adj) : two; double
వాడుక / Usage
ఇంగువతో పోపు పెట్టిన వంట సువాసన ఇనుమడిస్తుంది.
Food seasoned with asafoetida has an enhanced aroma.
మెదడుకు మేత / Food for thought
ఇనుము విరిగెనేని యినుమారు ముమ్మారు
కాచి యతుకనేర్చు గమ్మరీడుమనసు విరిగినేని మరియంట నేర్చునా?
విశ్వదాభిరామ వినురవేమ !
(ఇనుము విరిగితే దానిని రెండు మూడు సార్లు కాల్చి అతికించగలడు కమ్మరి. కానీ అదే మనిషి మనసు ఒక సారి విరిగితే(నొచ్చుకుంటే) దానిని తిరిగి అతికించటం ఎవరికీ సాధ్యం కాదు)
-- వేమన (1367 - 1478)
Comments
Post a Comment