కుత్సితము

 

మే 21, 2025

కుత్సితము (kutsitamu)

   అర్థము

  (విశేషణము) : నీచము; నికృష్టము; కుటిలము

  Meaning

  (adj) : vile; low; contemptible

    వాడుక / Usage

    అధికారం కోసం మతంతో కుత్సిత రాజకీయం.
    Contemptible politics using religion for the sake of power

  మెదడుకు మేత / Food for thought

    వేరుపురుగు చేరి వృక్షంబు జెఱచును
    చీడపురుగు చేరి చెట్టు చెఱచు
    కుత్సితుండు చేరి గుణవంతు చెఱచురా
    విశ్వదాభిరామ! వినుర వేమ!
    (వేరుకి పట్టిన పురుగు వృక్షాన్ని పాడు చేస్తుంది. చీడపురుగు చెట్టుని పట్టి పాడు  చేసినట్లే దుర్మార్గుడు గుణవంతుణ్ణి చేరి అతన్ని పాడు చేస్తుంటాడు)
    -- వేమన (1367 - 1478)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి