కాకతాళీయము

 

మే 26, 2025

కాకతాళీయము (kāka-tāḷīyamu)

   అర్థము

  (విశేషణము) : కాక=కాకి, తాళ=తాడి చెట్టు; తాళీ=తాడి పండు; కాకి తాటి చెట్టుపై వ్రాలిన క్షణాన తాటి పండు పడడం; సంబంధం లేని రెండు ఘటనలు ఏక కాలంలో జరగడం

  Meaning

  (noun) : chance; coincidence; as a palm fruit falling just when a crow has landed

    వాడుక / Usage

    ఋగ్వేదంలో ఆకాశానికి అధిపతి అయిన ద్యౌస్ పేరుకి, జూస్‌కి మధ్య ఉన్న పోలిక కేవలం కాకతాళీయం కాదు.
    The similarity between Dyaus, the Rig vedic God of heavens, and Zeus, the Greek God of heavens, is not a mere coincidence.

  మెదడుకు మేత / Food for thought

    ఎన్నో యేండ్లు గతించిపోయినవి గానీ,యీ శ్మశానస్ధలిన్
    గన్నుల్ మోడ్చిన మందభాగ్యుడొకఁడైనన్ లేచిరాఁ,డక్కటా!
    యెన్నాళ్ళీచలనంబులేని శయనం? బేతల్లు లల్లాడిరో!
    కన్నీటంబడి క్రాఁగిపోయినవి నిక్కంబిందు పాషాణముల్

    -- శ్మశాన వాటిక, గుర్రం జాషువా (1895 - 1971)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి