ఆకస్మికము
మే 27, 2025
ఆకస్మికము (ā-kasmikamu)
అర్థము
(విశేషణము) : హఠాత్తుగా/అనుకోకుండా/ఉన్నట్లుండి/తటాలున జరిగినది; కస్మాత్=ఎందుకు/ఎవరి కారణంగా; అకస్మాత్=కారణం లేకుండా/తెలియకుండా
Meaning
(adv) : suddenly; unexpected; causeless
వాడుక / Usage
హిమాచల్ ప్రదేశ్ లో ఆకస్మిక వరదలు, విరిగిపడిన కొండచరియలు.
Sudden floods in Himachal Pradesh trigger landslides.
మెదడుకు మేత / Food for thought
భూకంపం వచ్చిందన్నా
మరో యుద్ధం రేగిందన్నా
తన భార్య కవలల్ని కన్నదన్నా
కంగారుపడక కోటు తొడుక్కొని
కోటీశ్వరరావు ఆఫీసు కెళతాడు, వస్తాడు
– గొంగళి పురుగులు, దేవరకొండ బాల గంగాధర తిలక్ (1921 - 1966)
Comments
Post a Comment