కుందేటికొమ్ము
మే 29, 2025
కుందేటికొమ్ము (kundetikommu)
అర్థము
(విశేష్యము/విశేషణము) : కుందేలు/చెవుల పిల్లి కొమ్ము; అసంభవము(కుందేలు కి కొమ్ములు లేనట్లే); శూన్యము
Meaning
(noun) : a hare's horn; an impossibility/absurdity; that which doesn't exist
వాడుక / Usage
ప్రస్తుత నాయకుల్లో నిజాయతీ కుందేటికొమ్ము మాత్రమే.
Honesty in current crop of leaders is an absurdity.
మెదడుకు మేత / Food for thought
పువ్వటే నీ సొగసు - వేలుపుల - బువ్వటే నీ నవ్వు
ఈ వెలుగు లేమంటు - ఏను తడబడుటలేఎటుచూచినా వెలుగు - ఎదురు కొన్నది నన్ను
కళవళము పడుతూనె - కనులు మూసితి నేను
పువ్వటే నీ సొగసు - బువ్వటే నీ నవ్వు
కనులు మూసితినేమి - కాంతులాపుట ఎట్లు
నాలోన నాపైన - నానార్ధముల కాంతి
పువ్వటే నీ సొగసు - వేలుపుల - బువ్వటే నీ నవ్వు
-- శశికళ, అడవి బాపిరాజు (1895 - 1952)
Comments
Post a Comment