హంసపాదము

 

మే 30, 2025

హంసపాదము (hamsa-pādamu)

   అర్థము

  (విశేష్యము) : వ్రాతలో తప్పిపోయినచోట పెట్టే గుర్తు; ఇక్కడ తప్పినది వేరే చోట ఉందని గుర్తు; 
  

  Meaning

  (noun) : a caret or an asterisk; symbolises a mistake

    వాడుక / Usage

    'మన ఊరు- మన బడి'కి ఆదిలోనే హంసపాదం.
     Missteps plague launch of "Mana Ooru - Mana Badi".

  మెదడుకు మేత / Food for thought

    నీడలు! నీడలు! ఊళ్ళూ, ఇళ్ళూ
    పేదలగూళ్ళూ, కుబేరులమేడలు!
    ఆకాశంలో మబ్బులనీడలు!
    భూమిపైన ప్రారబ్ధపునీడలు!
    కునుకుకనులలో నిద్దురనీడలు!
    అచేతనంలో అద్దపునీడలు!
    ప్రేమలనీడలు! ద్వేషపునీడలు!
    శాంతపునీడలు! రోషపునీడలు!
    కదిలేనీడలు! కదలనినీడలు!
    తెలిసేజాడలు! తెలియనిజాడలు!
    రంగులనీడలు! తావులనీడలు!
    తెల్లకాగితపు టావులనీడలు!
    గడచినకాలపు చారల నీడలు!
    గడిచేకాలపు భారపు నీడలు!
    గడువనికాలపు దూరపు నీడలు!
    -- చీకటి నీడలు, ఆలూరి బైరాగి (1925 - 1978)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి