జడము
జూన్ 12, 2025
జడము (jaḍamu)
అర్థము
(విశేషణము) : తెలివి లేని; అచేతనము; మూర్ఖత్వం
Meaning
(adj) : inanimate; motionless; stupid
వాడుక / Usage
జడం రూపం మారుస్తూ ఉంటుంది గనక అశాశ్వతంగా కనిపిస్తుంది గాని అదీ శాశ్వతమే.
The inanimate keeps changing and whilst it appears transient it is actually permanent.
మెదడుకు మేత / Food for thought
మండు టెండలన్ కాలి, అఖండ వర్ష
పాతముల బడి బ్రద్దలై, పంకసంకులంబయి, అతల కుతలమై, లవము విసువు
నొంద దీ పృథివీదేవి, యోర్పదెంతొ !
కుమిలి క్రుళ్ళిన వస్తుచయము గ్రసించి
సుభగభూతిగా మార్చు నీ శుద్ధమూర్తి,
వక్షమున దాల్చి కొండల బరువుమోయు
కడుపుగోయు నాపగలను గారవించు.
ప్రాణులకు సరసాన్నముల్, వ్యాధులకు మ
హౌషధుల్, సుఖసాధన పోషణలకు
దివ్యఫలపుష్పఋతు కళా దృశ్యములు, స,
మృద్ధముగ నిచ్చుతల్లి నర్చింపరాదొ ?
-- రమ్యా లోకము, రాయప్రోలు సుబ్బారావు (1892 - 1984)
Comments
Post a Comment