అక్కసు

 

జూన్ 16, 2025

అక్కసు (akkasu)

   అర్థము

  (విశేష్యము) : కోపము; అసూయ; కసి; ఈర్ష
  

  Meaning

  (noun) : anger; malice; spite; envy

    వాడుక / Usage

    మరోసారి భారత పై ట్రంప్ అక్కసు.
     Trump again expresses disdain towards India.

  మెదడుకు మేత / Food for thought

    వేలకొద్ది ఆశలు అలాటివి ప్రతీ ఆశకై అది తుది శ్వాస అయ్యింది
    ఎన్నో తీరాయి నా కోరికలు అయినా తిరిగి కొంత తక్కువ అయ్యింది
    భయం ఎందుకు ప్రియ ఘాతి ఇంక ఏముంటుంది నా కంఠంలో
    ఆ రక్తం ధారలుగా ప్రతి రోజూ ప్రతి ఊపిరిలో కన్నీరు అయ్యింది
    కూడబెట్టిన పుణ్యం నిండుకుంటే తిరిగి మానవ జన్మే, వింటూనే ఉన్నాం ఇదేదో
    కాలరాసే అవమానాలు క్రమ్ముకుంటే నీ వీధిలో నా బ్రతుకు చీకటి అయ్యింది
    అందనంత ఎత్తులో ఉన్నావని విర్రవీగకు, నేల జారగలవు త్రుటిలో
     కొప్పు ముడి వీడినంతనే అందాల నీ కురుల నిడివి తెల్లము అయ్యింది
    అయినా తనకి లేఖ వ్రాయాలంటే ఎవరైనా, వ్రాయించుకోండి నాతో
    ప్రొద్దు పొడుస్తూనే కలం చెవిలో పెట్టుకుని బయలుదేరడం అయ్యింది
    మధువు తాగుతానని పేరుబడింది నాకు ఈ ఝాములో ఈ ఊరులో
    మళ్ళీ లోకంలో సురామృత కలశం మధించే సమయం అయ్యింది
    అనుకున్నాను నా కష్టాలకు సేద తీరుస్తుంది అని ఆర్తితో
    నా కన్నా ఎక్కువ వ్యధల అలజడితో తాను బేజారు అయ్యింది
    ప్రేమలో లేదు తేడా బ్రతికి ఉండడంలో కానీ కాక చావడంలో
    తననే చూసి బ్రతికేస్తున్నా, తన వంచన నా శ్వాసకు ఆఖరు కూడా అయ్యింది
    పట్టు నేస్తమా గట్టిగా పట్టి తీయి ముల్లు నా గుండెలో
    ముల్లుతో వస్తుంది నా హృదయం, అదే ఈ జీవచ్ఛవానికి విముక్తి అయ్యింది
    భగవంతుని మీద ఆన గుడి తలుపులు ఓ కఠినాత్మా తీయకో 
    భరించలేము మనం అది కూడా నమ్మలేని ప్రేమమూర్తి అయ్యింది
    ఎక్కడ మధుశాల తలుపులు గాలిబ్, ఎక్కడ స్వామీజీనో
    కానీ ఇది మాత్రం తెలుసు ఆయన రావడం నేను వెళ్లడం అయ్యింది
   
    -- హజారోన్ క్వాహిషే ఏసీ, గాలిబ్ - https://manatelugumaata.blogspot.com/2025/06/blog-post_15.html

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి