సంజాయిషీ
జూన్ 19, 2025
సంజాయిషీ (sanjāyishī)
అర్థము
(విశేష్యము) : సమాధానం; వివరణ
Meaning
(noun) : an explanation; response
వాడుక / Usage
సదరు కార్మికుడు సంజాయిషీ ఇచ్చుకునే పరిస్థితి ఉండదు.
There is no provision for the said employee to explain themselves.
మెదడుకు మేత / Food for thought
తల కొంతగా వంచితే రాయి కూడా దేవతై పోతుంది
తన నంతగా ప్రేమించకు తను వంచకై పోతుంది
నేనూ నదినే నా గతి శృతి నాకు తెలుసు
ఏ వైపుకు వెళితే అదే తుళ్ళి తుళ్ళి దారై పోతుంది
ఎంతో నిజాయతీతో జీవితం నాతో అంది
నువ్వు నాకు కాకపోతే మరొకరితో నాకు ముడై పోతుంది
పై వాడి మీద భారం వేసి తాగుతున్నాను మిత్రమా
హాలాహలం ఉన్నా ఇందులో ఔషధమై పోతుంది
అన్నీ తనవే గాలి పరిమళం నేల నీలాకాశం
నేను ఎటు వెళ్లినా ఎక్కడికి వెళ్లినా తనకి తేట తెల్లమై పోతుంది

-- బషీర్ బద్ర్, https://manatelugumaata.blogspot.com/2024/05/blog-post.html
Comments
Post a Comment