ఉద్భవము

 

జూన్ 27, 2025

ఉద్భవము (ud-bhavamu)

   అర్థము

  (విశేష్యము) : జననము; పుట్టుక; ఉత్పత్తి; పుట్టినది
  

  Meaning

  (noun) : birth; emanation 

    వాడుక / Usage

    జీవి ఉద్భవం నుండి ఆధునిక కంప్యూటరు దాకా క్లుప్తంగా చెప్పే కావ్యం గరికపాటి 'సాగర ఘోష'.
    Garikapati's poem 'Sagara Ghosha' spans origin of life till the genesis of computers.

  మెదడుకు మేత / Food for thought

    అతులిత పుణ్యమూర్తివి, కృతాత్ముఁడ వెందును నీవు ధర్మ మూ
    ర్జితముగ నెప్పు డేమఱక చేయుచు నుండుము, నిత్యశోభన
    స్థితి వెలుగొందు ; మేను భవదీయసమాగతిఁ జేసి ధర్మ సు
    స్థితమతి నైతి న న్ననుమతింపు గుణాకర! పోయి వచ్చెదన్
    (‘మంచిగుణాలకు నెలవైన ఓ ధర్మవ్యాధుడా! నీవు పున్నెముల ప్రోవవు. నీ జీవితం ధన్యమైనది. సదా ధర్మాన్నే ఆచరించేవాడవై నీ బ్రతుకును తీర్చిదిద్దుకొనుము. నీ చరిత్రవలన ధర్మం విస్తరించి వెలుగొంద గలదు. నీకు ఎల్లప్పుడు మేలు కలుగుగాక. నిన్ను కలిసికొనటంచేత నా జన్మం ధన్యమైనదిగా భావిస్తున్నాను. నీవలన నేను ధర్మసూక్ష్మాలను తెలిసికొన గలిగాను. నీమూలాన నాకు జ్ఞానోదయ మైనది. ఇక దయచేసి నాకు సెలవును అనుగ్రహించుము. నిన్ను వీడ్కొని నేను పోయి వస్తాను’.)
        -- ధర్మవ్యాధుడు కౌశికునకు చేసే బోధ, మహాభారత అరణ్యపర్వం, ఎఱ్రాప్రగడ (1284 - 1364)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి