తక్కెడ
జూన్ 09, 2025
తక్కెడ (takkeḍa)
అర్థము
(విశేష్యము) : బరువు తూచే తుల; కాటా
Meaning
(noun) : a balance; pair of scales
వాడుక / Usage
"తీసుకోండి - ఎంతకో ఒకంతకి" అని తక్కెడ తీసి తుయ్యబోయింది.
"Take it - will give a bargain" she said, weighing on the scales.
మెదడుకు మేత / Food for thought
యింతేనటే సంద్ర మెంతొయనుకొంటి
మనకూ సూరీడుకూ మద్దెనుందేనా!నానీతి నాజాతి
నావారెపోనాడ
మరిగి నామనసు సా
గరమాయెనన్నారు ఇంతే...
నారాజె నాకాసి
వేరు సూపులు సూడ
కడలివలె నా గుండె
కలతబడె నన్నారు ఇంతే...
సత్తె మెరిగినపాప
పొత్తిళ్లలో దాగి
కన్నీరు మున్నీరు
కరిగిస్తి నన్నారు ఇంతే...
అంచుదరి లేదంటె
అమృత ముంటాదంటె
దేము డంతుంటాదొ
ఏమొ యనుకొన్నాను ఇంతే...
-- సంద్రం, యెంకి పాటలు (1925), నండూరి సుబ్బారావు (1884 - 1957)
Comments
Post a Comment