దుర్భరము
జూన్ 25, 2025
దుర్భరము (dur-bha-ramu)
అర్థము
(విశేషణము) : భరింపలేనిది
Meaning
(adj) : unbearable
వాడుక / Usage
ఏదీ బకాయి వేతనం.. ఎన్నాళ్లీ దుర్భర జీవనం?
Where are the pending wages..how much longer this unbearable life?
మెదడుకు మేత / Food for thought
హలికుం డెంతయు నోజతో దునఁగ సీరాగ్రమునం జోఁకి ప్రా
ణు లనేకంబులు సచ్చు, హింస యది యౌనో కాదొ ! వేయేల? మర్త్యులు నేలం జరియించుచోఁ బదములం ద్రొక్కంబడు బెక్కు జం
తులు హింసావిధి గాదనంగ వశమే? దోషజ్ఞ! యూహింపుమా!
(ఓ పండితోత్తమా! నాగలితో రైతు భూమిని దున్నేటప్పుడు, ఆ నాగలికర్రును తాకి ఎన్ని జీవాలు చచ్చిపోవటం లేదు? అది హింస కాదని వాదించటానికి వీలున్నదా? తర్జన భర్జనలు అనవసరం. మనుజులు నేలపై నడచేటప్పుడు కూడ వేలకొలది ప్రాణులు చనిపోతున్నాయి. అది హింస కాదని వాదించటానికి వీలు లేదు కదా! ఈ విషయాన్ని దయచేసి నీవే ఆలోచించి తేల్చుకొనుము.)
-- ధర్మవ్యాధుడు కౌశికునకు చేసే బోధ, మహాభారత అరణ్యపర్వం, ఎఱ్రాప్రగడ (1284 - 1364)
Comments
Post a Comment