పరిణామము
జూన్ 11, 2025
పరిణామము (pari-ṇāmamu)
అర్థము
(విశేష్యము) : మార్పు; వికారము (ఆకార మార్పు) ; క్షేమము
Meaning
(noun) : change of form; transformation; welfare
వాడుక / Usage
పదార్థం అనుక్షణం పరిణామం పొందుతూ ఉంటుంది.
Matter undergoes transformation every moment.
మెదడుకు మేత / Food for thought
ఆకులో ఆకునై పూవులో పూవునై
కొమ్మలో కొమ్మనై నునులేత రెమ్మనై
ఈ యడవి దాగిపోనా ఎట్లైన నిచటనే యాగిపోనా?
గల గలని వీచు చిరుగాలిలో కెరటమై
జల జలని పారు సెలపాటలో తేటనై
ఈ యడవి దాగిపోనా ఎట్లైన నిచటనే యాగిపోనా?
పగడాల చిగురాకు తెరచాటు తేటినై
పరువంపు విరిచేడె చిన్నారి సిగ్గునై
ఈ యడవి దాగిపోనా ఎట్లైన నిచటనే యాగిపోనా?
తరు వెక్కి యల నీలగిరి నెక్కి మెలమెల్ల
చద లెక్కి జలదంపు నీలంపు నిగ్గునై
ఈ యడవి దాగిపోనా ఎట్లైన నిచటనే యాగిపోనా?
ఆకలా దాహమా చింతలా వంతలా
ఈ కరణి వెర్రినై యేకతమ తిరుగాడ
ఈ యడవి దాగిపోనా ఎట్లైన నిచటనే యాగిపోనా?
-- కృష్ణ పక్షము (1925), దేవులపల్లి కృష్ణ శాస్త్రి (1897 - 1980)
Comments
Post a Comment