మెలయు
జులై 02, 2025
మెలయు (melayu)
అర్థము
(క్రియ) : వర్తించు; పెనగు; మెలిక;కలిసి మెలిసి; సంచరించు
Meaning
(verb) : to mix / unite / entangle; to conduct / behave / apply oneself; roam
వాడుక / Usage
కలికి బొమ విండ్లుగల కాంతకును ధనురాశి మెలయు మినాక్షికిని మీనరాశి.
Beautiful bow-ed eye brows the Lady of Sagittarius; bright glancing eyes O Piscean damsel .
మెదడుకు మేత / Food for thought
ప్రపంచం జొరబడలేని నిశ్శబ్దం ఉంది.
అనాదిగా ఉన్న ప్రశాంతత నీ గుండెలోనే ఉంది,
చేజారలేదు నీకు అది.
పాపపు ఆలోచనలు మలినం చేయలేని పవిత్రత యొక్క అనుభూతి నీలో ఉంది.
నిన్ను కలవర పరిచేవన్నీ నీ బయట మాత్రమే ఉన్నాయి; నీ బయట అసలు ఏమీ లేనే లేవు.
నీ లోపల ఉన్నది మచ్చ లేనిది, విశ్వమంత అనంతమైనది, పరిపూర్ణమైనది.
నీకు కావలసిన ప్రతీది, వెతికే వన్నీ, అవసరమైనవంతా, నీలోనే అంతర్గతమై ఉన్నాయి.
-- జలాలుద్దీన్ ముహమ్మద్ రూమి (1207 - 1273)
Comments
Post a Comment