ప్రోద్బలము

 

జూన్ 26, 2025

ప్రోద్బలము (prōd-balamu)

   అర్థము

  (విశేష్యము) : ప్రేరణ; ప్రోత్సాహము; మద్దతు; పురికొలుపుట
  

  Meaning

  (noun) : support; aid; encouragement; instigation 

    వాడుక / Usage

    అధికార ప్రోద్బలంతో అసత్య ప్రచారాలు.
    Misinformation abounds, instigated and supported by government.

  మెదడుకు మేత / Food for thought

    జననుత ! వీరు నా జననియు జనకుండుఁ ! జూవె ! వీరలకు శుశ్రూష సేసి,

    యిట్టి పరిజ్ఞాన మేనుఁ బ్రాపించితి ! నమరులఁ బూజింతు రర్థి నెల్ల
    వారును ; నొండు దైవంబుల నెఱుఁగ; నీ ! వృద్ధుల నాపాలి వేల్పు లనఘ!
    కమనీయ ఫలపుష్పగంధభూషణవస్త్ర ! ములు మనోహరభక్ష్యభోజ్యములును

    వీరి కెపుడు నివేదింతు, వేడ్కఁ బుత్త్ర ! దారసహితుండ నై నియతముగ సేవ
    యాచరింతును; వేదముల్ యజ్ఞములు వ్ర ! తంబులును వీర నా కను తలఁపు దృఢము

(‘ప్రజలచేత కీర్తించబడినవాడా ! నా తలిదండ్రులు వీరే. వీరికి పరిచర్య చేయటంచేతనే నాకు ఈ పరిజ్ఞానం లభించింది. అందరూ వేడుకతో తమకోరికలు ఈడేరటానికై దేవతలను పూజిస్తారు. నాకు నా తలిదండ్రులే ప్రత్యక్ష దేవతలు. వేరే దేవతలను నేను ఎఱుగను. ఈ ముదుసలులే నాపాలిటి వేల్పులు. వీరలను, చందనచర్చతో, పండ్లతో, పూవులతో వారలకు కావలసిన తినుబండారాలతో అర్చిస్తాను. నాశ్రీమతితో నా బిడ్డలతో కలిసి వీరికి సేవ చేస్తాను. వారి సేవయే నేను చేసే యజ్ఞం. అదియే వేదాలు , నోములు – అనే భావమే నాలో లోతుగా నాటుకొని ఉన్నది.)

        -- ధర్మవ్యాధుడు కౌశికునకు చేసే బోధ, మహాభారత అరణ్యపర్వం, ఎఱ్రాప్రగడ (1284 - 1364)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి