త్రుళ్లు
జూన్ 10, 2025
త్రుళ్లు (truḷlu)
అర్థము
(క్రియ) : ఎగిరిపడు; గర్వించు; మిడిసిపడు
Meaning
(verb) : to rise and fall; to be arrogant/proud; to writhe
వాడుక / Usage
ఆ మాటకు అతడు త్రుళ్ళి పడ్డాడు.
He jumped out of his skin on hearing that.
మెదడుకు మేత / Food for thought
ఓ విభావరీ! ఓహో విభావరీ!
నీహార హీర నీలాంబర
ధారిణీ, మనోహారిణీ!!
నీ చంచల చేలాంచల
నిభృత స్వప్న సీమలలో
ఏలా భయచ్ఛాయాజాల
మేలా సౌఖ్యరోచిర్లీల!!
ఓ విభావరీ! ఓహో విభావరీ!!
సంతత శాంతతరంగిణి
మదభరయువకురంగిణి
ఏలా యలసగమనమ్ము
ఏలా నవవిలసనమ్ము!!
ఓ విభావరీ! ఓహో విభావరీ!!
ధరణీతలచంద్రశిలా
తరళమంటపమున నిలిచి
యుగములుగ పరిభ్రమింతు
నగమ్యుడౌ యెవని వలచి!!
ఓ విభావరీ! ఓహో విభావరీ!!
-- డా బాలాంత్రపు రజనీకాంతరావు (1920 - 2018)
Comments
Post a Comment