అర్భకము
జూన్ 24, 2025
అర్భకము (ārbhakamu)
అర్థము
(విశేష్యము) : బీదతనము; దారిద్ర్యము; గర్భము; సంయుక్త బీజము
Meaning
(noun) : poverty; foetus;
వాడుక / Usage
పిల్లాడు అర్భకంగా పుట్టాడు. తల్లి దగ్గర పాలు లేవు. డబ్బా పాలు పడటం లేదు.
The boy was born emasculated. His mother had no milk and formula didn't agree.
మెదడుకు మేత / Food for thought
దానంబు, సత్యంబుఁ, దపము, యజ్ఞము, నార్జ! వముఁ, గామలోభాది వర్జనంబు,
గురుజన శుశ్రూష, క్రోధరాహిత్యంబు ! దమము, సంతోష, మధ్యయన నిరతి,దాంభికత్వము లేమి, దైన్యంబు వొరయమి,! యనసూయ, యనహంక్రియాభియుక్తి,
డలఁపంగ నాద్యమై తనరు ధర్మమ యెప్డుఁ ! గొనియాట, నాస్తికగోష్ఠిఁ జనమి
శీలసంరక్ష, తీర్థసంసేవ, శౌచ ! మఖిలభూతంబులందు దయార్ద్రుఁ డగుట,
మితహితోక్తులు, సంశ్రితమిత్రగుప్తి ! యిన్నియును శిష్టచరితంబు లిద్ధచరిత !
మితహితోక్తులు, సంశ్రితమిత్రగుప్తి ! యిన్నియును శిష్టచరితంబు లిద్ధచరిత !
(దానం చేయటం ఎల్లప్పుడును నిజమే మాట్లాడటం, తపస్సు, యజ్ఞయాగాదులు చేయడం, కామ క్రోధ లోభ మోహ, మద మాత్సర్యాలను ఉజ్జగించటం, తల్లి తండ్రి గురువులకు సేవ, కోపం లేని శాంతస్వభావాన్ని ఆర్జించటం, ఇంద్రియనిగ్రహం దీక్షతో సాధించటం, ఎల్లప్పుడు సంతోషంతో సంతృప్తితో ఉండటం, వేదాధ్యయన తత్పరత్వం, పటాటోపం ప్రదర్శించక సదా వినయం గలిగి ఉండటం, ఎన్నడును నీచత్వానికి దిగజారి పోవకుండటం, అసూయ లేకుండా ఉండటం, అహంకారం లేకుండా పనులు చేయటం, ధర్మాన్ని ఎప్పుడూ కొనియాడుతుండటం, నాస్తికుల కూటమిలో చేరకుండటం, శీలాన్ని కాపాడుకొనటం, తీర్థయాత్రలు చేయటం, అఖిలభూతాలపట్ల దయకలిగిన ఎడద గలిగిఉండటం, మితభాషణం చేయటం, హితభాషణం చేయటం, ఆశ్రయించిన స్నేహితులను కాపాడటం.)
-- ధర్మవ్యాధుడు కౌశికునకు చేసే బోధ, మహాభారత అరణ్యపర్వం, ఎఱ్రాప్రగడ (1284 - 1364)
Comments
Post a Comment