తుంటరి
ఆగష్టు 08, 2025
తుంటరి (tunṭari)
అర్థము
(విశేషణము) : దుష్టుడు; పోకిరి; అల్లరి చేసేవాడు
Meaning
(noun/adj) : mischievous; naughty; wicked person
వాడుక / Usage
తలలోన తురుముకున్న తుంటరి మల్లె తలపులతో ఎన్నెన్నో మంటలు రేపే హ అబ్బా సూర్యుడి చుట్టూ తిరిగే భూమికిమల్లే నా ఓర్పుల నిట్టూర్పుకు జాబిలివాడే.
The mischievous jasmine in my hair, smoulders me with desires; moon soothes earth, scorched by the Sun it revolves around; he is the balm to the sighs of my endurance.
మెదడుకు మేత / Food for thought
బలవంతుడ నాకేమని
పలువురతో నిగ్రహించి పలుకుట మేలా
బలవంత మైన సర్పము
చలి చీమల చేత జిక్కి చావదె సుమతీ!
(నేను బలవంతుడను నాకేమి భయమున్నది అని చాలా మందితో నిర్లక్ష్యము చేసి పలికి విరోధము తెచ్చుకొనుట మంచిదికాదు. అది యెప్పుడూ హానిని కలిగించును. మిక్కిలి బలము కలిగిన సర్పము కూడా చలి చీమలకు లోబడి చచ్చుటలేదా?)
-- బద్దెన
Comments
Post a Comment