ఎండమావి
ఆగష్టు 04, 2025
ఎండమావి (eṇḍa-māvi)
అర్థము
(విశేష్యము) : మృగతృష్ణ; మరీచిక; ఎండ ఆవిరి దూరాన నీరులా కనపడుట
Meaning
(noun) : mirage
వాడుక / Usage
ఎడారి దారులు వెతికాను.. ఎండమావినై బ్రతికాను బ్రతుకు దారిలో బాటసారినై.. విసిగి వేసారి వచ్చాను.
Desolate paths, I looked in..became one with mirages..in life's journey, I am here a dreary traveller.
మెదడుకు మేత / Food for thought
తలనుండు విషము ఫణికిని
వెలయంగా దోక నుండు వృశ్చికమునకున్
తలతోక యనక యుండును
ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ!
(సర్పమునకు విషము తలయందుండును, తేలునకు తోకయందుండును. దుష్టునకు విషము తలతోక యనకుండ శరీరమంతనుండును.)
(సర్పమునకు విషము తలయందుండును, తేలునకు తోకయందుండును. దుష్టునకు విషము తలతోక యనకుండ శరీరమంతనుండును.)
-- బద్దెన
Comments
Post a Comment