తీవె
ఆగష్టు 11, 2025
తీవె (teeve)
అర్థము
(విశేష్యము) : తీవియ; తీగ; లత;
Meaning
(noun) : a wire; creeper; climbing plant
వాడుక / Usage
చీకటి తీవెల రాతిరి వీణియ నవ్విన వేకువ చూపులని ఆమని తేనెల వాగుల పొంగిన తీయని అలలే మాటలవి.
The melody of laughter is the break of dawn in a creeping night; speech is the undulating waves rising from the torrents of sweet moonlight.
మెదడుకు మేత / Food for thought
తివిరి యిసుమునఁ దైలంబు దీయవచ్చుఁ
దవిలి మృగతృష్ణలో నీరు ద్రావవచ్చుఁ
దిరిగి కుందేటికొమ్ము సాధింపవచ్చుఁ
జేరి మూర్ఖుల మనసు రంజింపరాదు
(కష్టపడి ఇసుక నుండి నూనె పిండవచ్చు, ఎండమావులనుండి నీరు సంపాదించి త్రాగవచ్చు, వెదకి వెదకి కొమ్ములున్న కుందేలు పట్టుకొని కొమ్మును సాదించవచ్చు. కాని, మూర్ఖుల మనసును మాత్రము సంతోషపెట్టలేము. లౌకింగా అసాధ్యమైన పనులన్నాసుసాధ్యమౌతాయేమో కాని, మూర్ఖున్ని మార్చటం మాత్రము అంత తేలికకాదు)
-- సుభాషిత రత్నావళి, ఏనుగు లక్ష్మణ కవి
Comments
Post a Comment