నీలాలు
జులై 28, 2025
నీలాలు (neelalu)
అర్థము
(విశేషము) : మ్రొక్కు బడి ఇచ్చిన వెంట్రుకలు; కన్నీళ్లు
Meaning
(noun) : tonsuring head as a religious offering; tears
వాడుక / Usage
నీలాలు కారేనా కాలాలు మారేనా నీ జాలి నే పంచుకోనా నీ లాలి నే పాడలేనా.
Moist eyes wet your cheeks, relentless time marches on; can I not share your sorrow?! won't you let me sing you a lullaby?!
మెదడుకు మేత / Food for thought
ఉదకము ద్రావెడు హయమును
మదమున నుప్పొంగుచుండు మత్తేభంబున్
మొదవు కడ నున్న వృషభము
జదువని యానీచు గడకు జనకుర సుమతీ
మదమున నుప్పొంగుచుండు మత్తేభంబున్
మొదవు కడ నున్న వృషభము
జదువని యానీచు గడకు జనకుర సుమతీ
(నీరు త్రాగెడు గుఱ్ఱము కడకును, క్రొవ్వుచే విజృంబించు మదపుటేనుగుకడకును, ఆవుకడనున్న ఆబోతు దగ్గరకును, విద్య నేర్వని అల్పుని కడకును వెళ్ళకుము)
-- బద్దెన
Comments
Post a Comment