కడతేరు
జులై 30, 2025
కడతేరు (kadatEru)
అర్థము
(క్రియ) : సమాప్తమగు; నశించు; చచ్చిపోవు
Meaning
(verb) : to be finished; absolve; die
వాడుక / Usage
ఆ తారలో తేలి తళతళ మెరిసే రేయిలో ఒడిలో నువ్వుంటే ఒదిగిపోతుంటే కడతేరి పోవాలిలే.
Floating amongst stars the night shimmers; you in my lap, us melting into one, let me rise no more.
మెదడుకు మేత / Food for thought
కనకపు సింహాసనమున
శునకము గూర్చుండబెట్టి శుభ లగ్నమునం
దొనరగ బట్టము గట్టిన
వెనుకటి గుణమేల మాను వినరా సుమతీ
(కుక్కను తీసుకొని వచ్చి మంచి ముహూర్తమునందు బంగారు గద్దె మీద కూర్చుండబెట్టి పట్టాభిషేకము చేసినప్పటికి దాని నైజగుణము నేలాగున మానలేదో, ఆ విధముగనే అల్పుడైనవానికి ఎంత గౌరవము చేసి మంచి పదవొసంగినను తన నీచత్వమును వదలనేరడు)
-- బద్దెన
Comments
Post a Comment