నిశీథి
ఆగష్టు 05, 2025
నిశీథి (niṣīthi)
అర్థము
(విశేష్యము) : నడిరేయి; అర్థరాత్రి
Meaning
(noun) : midnight
వాడుక / Usage
ఈ నిశీథిలో ఈ నిరాశలో రగిలే హృదయం నా రాగం రాదా ఉదయం నాకోసం.
My ballad is the flame of my heart in the lonely hopelessness of this night; morning will it not come?
మెదడుకు మేత / Food for thought
ధనపతి సఖుడైయుండగ
నెనయంగా శివుడు భిక్షమెత్తగ వలసెన్
దన వారి కెంత గలిగిన
దన భాగ్యమె తనకు గాక తథ్యము సుమతీ!
(గొప్ప ధనవంతుడైన కుబేరుడు తనకు మిత్రుడై యున్నను శివుడు బిచ్చమెత్తవలసి వచ్చెను. కావున తాను సంపాదించుకొన్న (తన దగ్గరున్న) భాగ్యమే తనకు సహాయ పడవలయును కాని తన దగ్గర నున్నవాడికడ నెంత భాగ్యమున్నను నిష్ప్రయోజనము)
-- బద్దెన
Comments
Post a Comment